సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ అధికారులు దుకాణాలపై దాడులు నిర్వహించి పాలీథిన్ కవర్లు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించామని పురపాలక కమిషనర్ సుజాత వెల్లడించారు.
నిబంధనలకు విరుద్ధంగా వాడితే కఠిన చర్యలు : మున్సిపల్ కమిషనర్ - సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పురపాలిక కమిషనర్
నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మందం ఉన్న పాలీథిన్ కవర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అమీన్పూర్ పురపాలక కమిషనర్ సుజాత హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని దుకాణాలపై సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
నిబంధనలకు విరుద్ధంగా వాడితే కఠిన చర్యలు : మున్సిపల్ కమిషనర్
దుకాణదారులు ఎవరైనా ఇలాంటి కవర్లను వాడితే కఠినచర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదేపనిగా పలుసార్లు ప్లాస్టిక్ కవర్లు వాడుతూ పట్టుబడితే రూ.2 వేల జరిమానాతో పాటు దుకాణం సీజ్ చేస్తామన్నారు. పాలీథిన్ కవర్ల నిషేధంపై వ్యాపారులకు ఆమె అవగాహన కల్పించారు.