తెలంగాణ

telangana

ETV Bharat / state

కుక్క చనిపోయిందని.. చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు కేసు! - తెలంగాణ వార్తలు

ఆ దంపతులిద్దరికి మూగజీవాలంటే ఎనలేని ప్రేమ. వీధి కుక్కలను చేరదీసి.. వాటికి ఆహారం అందించి అక్కున చేర్చుకునే మనస్తత్వం వారిది. అలా వారు పెంచుకున్న ఓ శునకం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు.

street-dog-suspected-death
మూగజీవాల అంటే ఎనలేని ప్రేమ

By

Published : Aug 27, 2021, 10:26 AM IST

కొందరు మనుషులతో సమానంగా జీవులను ప్రేమిస్తుంటారు. వాటికి ఏ మాత్రం హాని జరిగినా తట్టుకోలేరు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం పటేల్​గూడలోని రామ్​కోటి, విజయలక్ష్మీరాణి ఈ కోవకే చెందుతారు. ఈ దంపతులకు మూగజీవాల అంటే ఎనలేని ప్రేమ. అంగవైకల్యం, ఇతర ఇబ్బందులు ఉన్నా వీధి కుక్కలను పెంచుతూ... కమ్యూనిటీ యానిమల్​ ప్రొటెక్టర్లుగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఓ వీధి కుక్కును చాలాకాలంగా పెంచుకుంటున్నారు. అనుమానాస్పద స్థితిలో అది గురువారం ఉదయం చనిపోయింది. శునకం మరణాన్ని ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. అమీన్​పూర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమ శునకాన్ని చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:ఈ శునకం తెలివితేటలు మామూలుగా లేవు!

ABOUT THE AUTHOR

...view details