తెలంగాణ

telangana

ETV Bharat / state

'పుట్టనిద్దాం, ఎదగినిద్దాం, బతకనిద్దాం, చదువుకోనిద్దాం'

ఆడపిల్లల సంక్షేమం కోసం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మా రెడ్డి తెలిపారు. అడపిల్ల పుడితే అంగన్వాడీల భాగస్వామ్యంతో పూలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పుట్టనిద్దాం, ఎదగినిద్దాం, బతకనిద్దాం, చదువుకోనిద్దాం అన్న నినాదంతో ముందుకు వెళుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

State Women's Commission Chairperson Sunithalakshma Reddy said that everyone should work for women's equality in the society.
'పుట్టనిద్దాం, ఎదగినిద్దాం, బతకనిద్దాం, చదువుకోనిద్దాం'

By

Published : Feb 19, 2021, 9:29 PM IST

సమాజంలో మహిళ సమానత్వం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మా రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అంగన్వాడీ ఉపాధ్యాయులకు, ఆయాలకు చీరలు అందించారు.

మాతా శిశు సంక్షేమ విభాగంలో మరణాల రేటు తగ్గుతోందని సునీతాలక్ష్మా రెడ్డి తెలిపారు. ఇందుకు కారణం అంగన్వాడీలు అందిస్తున్న సేవలేనని ఆమె పేర్కొన్నారు. అంగన్వాడీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతీ అంగన్వాడీ ఉపాధ్యాయురాలికి చరవాణి అందించి, కార్యక్రమాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల రక్షణ విషయంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని కోరారు.

ఇదీ చదవండి:రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details