తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎంపీటీసీలకు గ్రామాల్లో విలువివ్వడం లేదు' - సంగారెడ్డి జిల్లా తాజా వార్త

సంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులను రాష్ట్ర ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు గడీల కుమార్​గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు పార్టీలకు అతీతంగా అందరం ఏకమై ఆందోళ చేస్తామని ప్రమాణం చేశారు.

State MPTC Association Committee meeting at Sangareddy
'ఎంపీటీసీలకు గ్రామాల్లో విలువివ్వడం లేదు'

By

Published : Oct 8, 2020, 4:20 PM IST

రాష్ట్ర ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు గడీల కుమార్ ​గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా వడ్ల వరకుమార్, ఉపాధ్యక్షుడిగా పాండును ఎన్నుకున్నారు. ఎంపీటీసీలకు గ్రామాల్లో విలువ ఇవ్వడం లేదని కుమార్​గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వం ఎంపీటీసీలకు కనీస వేతనం 5000 నుంచి 20,000 వరకు పెంచాలని, గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

నిధులు, విధులు, అధికారాల సాధనకై మున్ముందు కార్యాచరణ చేపడతామన్నారు. పార్టీల ప్రమేయం లేకుండా అందరూ కార్యాచరణలో భాగం కావాలని కోరారు. ప్రభుత్వం ఎంపీటీసీలకు ప్రోటోకాల్ ఇవ్వాలని.. ఎంపీటీసీ బోర్డును ఏర్పాటు చేసి ఒకరిని క్లర్క్​గా నియమించాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే ఉద్యమాలు చేపట్టడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.


ఇదీ చూడండి:12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు.. చట్ట సవరణలు చేసే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details