తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణపై అవగాహన లేని వారు వచ్చి విమర్శలు చేస్తున్నారు' - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి హరీశ్​రావు తెలిపారు. రాష్ట్రంపై కనీస పరిజ్ఞానం లేని వారు తెలంగాణలో రైతు సంతోషంగా లేడని అంటున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో మంత్రి హరీశ్​రావు పర్యటించారు.

'అవగాహన లేనివారొచ్చి రైతులకు ఏం జరిగింది అంటున్నారు'
'అవగాహన లేనివారొచ్చి రైతులకు ఏం జరిగింది అంటున్నారు'

By

Published : Feb 10, 2021, 6:22 PM IST

Updated : Feb 10, 2021, 7:25 PM IST

తెలంగాణ గురించి కనీస అవగాహన లేని వారు రాష్ట్రంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఎవరో వచ్చి తెలంగాణలో రైతు సంతోషంగా లేడని అంటున్నారని.. వారికి రాష్ట్రంపై కనీస పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాత్రమే ఇస్తుంటే... తెలంగాణలో కేంద్రం నిధులతో పాటు రైతుబంధు పేరుతో అదనంగా ఎకరాకు పదివేల రూపాయలు అందిస్తున్నామన్నారు.

సంగారెడ్డి జిల్లా కందిలో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. కందిలో రైతు వేదికను ఆయన ప్రారంభించారు. రైతు వేదికలు... రైతుల ఆత్మగౌరవ భవనాలుగా మంత్రి అభివర్ణించారు. కాంగ్రెస్​ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని... తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో కూడా లేవని హరీశ్​రావు అన్నారు. బడ్జెట్​లో సింహభాగం వ్యవసాయ రంగానికే కేటాయిస్తామని మంత్రి తెలిపారు. కూరగాయలు, పండ్ల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

'అవగాహన లేనివారొచ్చి రైతులకు ఏం జరిగింది అంటున్నారు'

ఇదీ చూడండి:త్వరలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్​

Last Updated : Feb 10, 2021, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details