తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ మనుగడకు డ్రైవర్లు, కండక్టర్లే ప్రధాన కారణం'

టీఎస్​ ఆర్టీసీ మనుగడకు డ్రైవర్లు, కండక్టర్లు ప్రధాన కారణమని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముని శేఖర్ అన్నారు. వారి కృషి వల్లనే సంస్థ లాభాలు సాధించగలదని పేర్కొన్నారు. నారాయణఖేడ్​ డిపోను సందర్శించారు.

RTC Executive Director Muni Shekhar visited Narayankhed Depot
నారాయణఖేడ్ డిపోను సందర్శించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముని శేఖర్

By

Published : Jan 7, 2021, 6:42 PM IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మనుగడకు డ్రైవర్లు, కండక్టర్లు ప్రధాన కారణమని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముని శేఖర్ అన్నారు. లాభాలు ఆర్జించేందుకు వారు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోను ఆయన సందర్శించారు.

మరువలేం..

ఆర్టీసీ కార్మికుల కృషి మరువలేనిదని ముని శేఖర్ కొనియాడారు. కరోనాతో కొన్ని రోజులు సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం ఆదుకోవడంతో జీతాలు ఇస్తున్నామని తెలిపారు.

చాలా అభివృద్ధి..

నారాయణఖేడ్ ప్రాంతం మారుమూలగా ఉందని అనుకున్నామని పేర్కొన్నారు. అయితే.. ఇక్కడ ప్రజా రవాణా చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రకు ఇది సరిహద్దుల్లో ఉన్నందున అంతర్రాష్ట్ర సర్వీసులు సైతం నడుపుతామని తెలిపారు.

కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్ఎం రాజేశ్వర్, డీవీఎం ప్రభులత, నారాయణఖేడ్ డీఎం రామచంద్రమూర్తి, మార్కెటింగ్ అధికారి పాండు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డికి షోకాజ్​ నోటీసు

ABOUT THE AUTHOR

...view details