వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. కొండాపూర్ మండలం ఆలియాబాద్‌లో డాక్టర్ శ్రీనివాసరావు సాగు చేస్తున్న డ్రాగన్ ప్రూట్ తోటను సందర్శించారు. వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో పండే వివిధ రకాల డ్రాగన్ ఫ్రూట్‌ను తెలంగాణలో పండిస్తున్న శ్రీనివాసరావును మంత్రులు అభినందించారు.
డ్రాగన్ ఫ్రూట్ సాగులో శ్రీనివాస రావు కృషి అద్వితీయం - Srinivasa Rao's contribution in Dragon Fruit cultivation is commendable
సంగారెడ్డి జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువరైతు శ్రీనివాసరావును మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలు అభినందించారు.
డ్రాగన్ ఫ్రూట్ సాగులో శ్రీనివాస రావు కృషి అభినందనీయం
పండ్లను సాగు చేయటంతోపాటు.. ఉప ఉత్పత్తులు తయారు చేయడం ఆదర్శనీయమని కొనియడారు. రైతులకు నాణ్యమైన మొక్కలు అందించేందుకు నర్సరీ ఏర్పాటు చేయటంతోపాటు మెళకువలు నేర్పుతుండటం అభినందనీయమని మంత్రులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-'లాక్డౌన్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'