సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లిలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
పోతిరెడ్డిపల్లిలో ఘనంగా శివపార్వతుల కల్యాణం - shivarathri celebrations
సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లిలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.
ఘనంగా శివపార్వతుల కల్యాణం
శివ పార్వతుల కల్యాణంలో ముత్యాలతో తలంబ్రాలను పోసి కన్నుల పండువగా కల్యాణం నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో తీర్థ ప్రసాదాలు అందించారు.
ఇదీ చదవండి: 'వైకాపా రిగ్గింగ్‌ను అడ్డుకున్నాం.. పోలీసుల విధులను కాదు'