అయోధ్యలో రామమందిరం శంకుస్థాపన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టపాసులు కాల్చి.. జైశ్రీరామ్ నినాదాలతో యువత హోరెత్తించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భాజపా నాయకులు పాల్గొన్నారు. అలాగే గోమాతకు ప్రత్యేక పూజలు చేసి దానికి దాణా తినిపించారు.
మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఇంట్లో ప్రత్యేక పూజలు - రామమందిరం శంకుస్థాపన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ వూజలు
రామమందిరం శంకుస్థాపన సందర్భంగా పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఇంట్లో ప్రత్యేక పూజలు special- Worshiped at patancheru-for-rama-mandir-bhumi-puja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8303173-457-8303173-1596619014609.jpg)
మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఇంట్లో ప్రత్యేక పూజలు
అనంతరం స్థానిక పంచముఖ వీరహనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం చేశారు.
ఇదీ చూడండి:-పునాది రాయితో పులకించిన అయోధ్య
TAGGED:
rama bhumi Pujalu patancheru