తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ ఆరోగ్యంగా ఉండాలని సంగమేశ్వర ఆలయంలో పూజలు - special pujas for cm kcr

సీఎం కేసీఆర్​ క్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్​ రావు ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.

కేసీఆర్​ కోసం సంగమేశ్వర ఆలయంలో పూజలు

By

Published : Apr 22, 2021, 1:04 PM IST

సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయంలో స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. కేసీఆర్​ పూర్తి ఆరోగ్యంతో కోలుకొని రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు.

ప్రత్యేక పూజా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనకు సంగమేశ్వరుడి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పూజలో జహీరాబాద్ చక్కెర అభివృద్ధి మండలి ఛైర్మన్ ఉమాకాంత్ పాటిల్, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆస్పత్రి మెట్ల వద్ద.. భార్య ఒడిలోనే కరోనా రోగి మృతి

ABOUT THE AUTHOR

...view details