సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి దృష్టికి తీసుకువచ్చేందుకు ఈటీవీ భారత్ ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మోజీరాం రాథోడ్‌కు విన్నవించుకున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సిటీస్కాన్ పనిచేయడం లేదని.. అదేవిధంగా ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగ్యూ పరీక్షల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సమస్యలు తెలుసుకున్న మోజీరాం... వీలైనంత త్వరగా అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నామని... అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈటీవీ భారత్ ఫోన్‌ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన... - Special Response to ETV BHARAT Phone In ...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎదురవుతున్న సమస్యలను వైద్యాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈటీవీ భారత్ నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి మోజీరాం రాథోడ్ సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
![ఈటీవీ భారత్ ఫోన్‌ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4510718-thumbnail-3x2-ppp.jpg)
Special Response to ETV BHARAT Phone In ...
TAGGED:
ఈటీవీ- ఈనాడు ఫోన్ ఇన్