తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు భద్రత.. అందరి బాధ్యత: ఎస్పీ - swangareddy sp chandra shekar reddy latest news

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 32వ జాతీయ భద్రతా మాసాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ తీశారు.

SP Chandrasekhar Reddy flagged off the 32nd National Security Month at the Collectorate in Sangareddy district center.
'నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోకండి'

By

Published : Jan 18, 2021, 1:21 PM IST

సంగారెడ్డి కలెక్టరేట్​లో 32వ జాతీయ భద్రతా మాసాన్ని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అందులో భాగంగా భద్రతా చర్యలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

ద్విచక్ర వాహన ర్యాలీ

రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించడానికి పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ తీశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని సూచించిన ఎస్పీ.. నిబంధనలు పాటించకుండా వ్యవహరించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రకృతి వనాలతో ఆహ్లాదం, ఆరోగ్యం: మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌

ABOUT THE AUTHOR

...view details