తెలంగాణ

telangana

ETV Bharat / state

నెలరోజుల్లో పెళ్లి.... అంతలోనే - Son_dead_mother_injured in sangareddy accident

పెళ్లి శుభలేఖలు పంచేందుకు తల్లితో కలిసి కారులో వెళ్తున్న వరుడు జహీరాబాద్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లీకొడుకు ప్రమాదానికి గురి కావడం వల్ల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

నెలరోజుల్లో పెళ్లి.... అంతలోనే

By

Published : Mar 25, 2019, 6:11 AM IST

Updated : Mar 25, 2019, 3:08 PM IST

నెలరోజుల్లో పెళ్లి.... అంతలోనే
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లి వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ కొంపల్లిలో నివాసం ఉంటున్న ప్రతీక్​కు మహారాష్ట్రకు చెందిన యువతితో ఏప్రిల్‌ 18న పెళ్లి నిశ్చయం అయింది. కర్ణాటకలోని గుల్బర్గాలో బంధువులకు పెళ్లి పత్రికలు అందించేందుకు తల్లి అల్కబాయితో కలిసి బయలుదేరారు. జహీరాబాద్‌ సమీపంలో ముందు వెళ్తున్న లారీని దాటే క్రమంలో వెనక నుంచి వీరి వాహనం ఢీకొట్టడం వల్ల ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రతీక్‌ మార్గమధ్యంలో మృతిచెందాడు. మెరుగైన వైద్యం కోసం అల్కబాయిని హైదరాబాద్‌కు తరలించారు. ప్రతీక్ మరణవార్తతో పెళ్లి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి.
Last Updated : Mar 25, 2019, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details