విద్యార్థుల రాకతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాఠశాలలు సందడిగా మారాయి. పది నెలల తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తరగతులకు హాజరయ్యారు. చాలా కాలం తర్వాత తమ స్నేహితులను కలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
'కొవిడ్ నిబంధనల మధ్య.. ప్రత్యక్ష బోధన' - schools reopened in telangana
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులు చెప్పినా.. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పెడచెవినపెట్టాయి. పలు చోట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించి విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగేలా వ్యవహరించారు.
సంగారెడ్డిలో పాఠశాలలు పునఃప్రారంభం
కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ తరగతులు నిర్వహించాలని అధికారులు చెప్పినా... జిల్లాలోని కొన్ని పాఠశాలల యాజమాన్యం పెడచెవినపెట్టారు. థర్మల్ స్క్రీనింగ్ చేయడంలో నిర్లక్ష్యం వహించి.. విద్యార్థుల ప్రాణాలకు హాని కలిగేలా వ్యవహరించారు. కొన్ని పాఠశాల నిబంధనలు పాటించకపోవడం వల్ల తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు.
- ఇదీ చూడండి :భాగ్యనగరంలో బడిబాట.. విద్యార్థుల్లో ఉల్లాసం