తెలంగాణ

telangana

ETV Bharat / state

"పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం" - పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని

పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అమరవీరుల కుటుంబ సభ్యులు అమరుల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు

By

Published : Oct 21, 2019, 2:53 PM IST

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబి నుంచి పోలీసు కేంద్రం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అమరులకు నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1959 అక్టోబర్ 21న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైన్యం దాడిలో వీరమరణం పొందారు. అప్పటి నుంచి ఈరోజును పోలీసు అమరవీరుల దినోత్సవంగా జరుపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు పోలీసులు వీరమరణం పొందారని తెలిపారు. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతిభ కనబరిచిన పోలీసులు, విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

ఇదీ చూడండి : ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం...

ABOUT THE AUTHOR

...view details