* వికారాబాద్ జిల్లా తోరుమామిడికి చెందిన మొగులయ్య (38) శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీనగర్‌కాలనీలో విద్యుత్తు నియంత్రికను పట్టుకున్నారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు.
* కామారెడ్డి జిల్లా జుక్కల్‌కు చెందిన రాజు (34), పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన లక్ష్మయ్య(60)లు శనివారం రాత్రి కల్లు తాగేందుకని వెళుతూ మార్గమధ్యలో మూర్ఛవచ్చి పడిపోయారు. కుటుంబ సభ్యులు గమనించి వారిని ఇంటికి తీసుకురాగా ఆదివారం తెల్లవారుజామున వారిరువురు తమ ఇంట్లో మృతిచెందారు.
* మెదక్ జిల్లా చేగుంటకు చెందిన నత్తి మంగమ్మ (55) కల్లు లభించక మతిస్థిమితం కోల్పోయి ఇంట్లోనే కింద పడి తీవ్రంగా గాయాలపాలై చనిపోయింది.
* వెల్లుర్తి మండలం మాసాయిపేటకు చెందిన కాశమైన కిష్టయ్య (76) తన ఇంట్లోనే దూలానికి ఉరివేసుకుని చనిపోయాడు.
* నిజాంపేట మండలం బచ్చురాజ్‌పల్లి గ్రామస్థుడు కిష్టయ్య (40) కుటుంబ సభ్యులంతా నిద్రపోయిన తరువాత ఇంట్లో నుంచి పారిపోయి స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.