సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ జలశాయం 29.9టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది. మంజీర ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 15000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.
Singoor Project: సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
ఎగువ నుంచి భారీ వరద రావటంతో సంగారెడ్డి జిల్లా సింగూర్ జలశాయం నిండుకుండలా మారింది. వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉండటంతో రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

సింగూర్ ప్రాజెక్టు
వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉండటంతో రెండు క్రస్టు గేట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 23000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంజీరా పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి:CHENNAMANENI CITIZENSHIP DISPUTE: ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ