తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు అతిక్రమించిన షాపింగ్ మాల్ సీజ్ - తెలంగాణ వార్తలు

కరోనా నిబంధనలు అతిక్రమించిన షాపింగ్ మాల్​ని అధికారులు సీజ్ చేశారు. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణఖేడ్​లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సీజ్ చేశారు.

Shopping mall siege for violating regulations, shopping mall seize
షాపింగ్ మాల్ సీజ్, కొవిడ్ నిబంధనలు పాటించని షాపింగ్ మాల్ సీజ్

By

Published : Apr 30, 2021, 8:16 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కొవిడ్ నిబంధనలు అతిక్రమించిన ఒక షాపింగ్ మాల్​ను మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. మాల్​లో స్థానిక మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి తనిఖీలు నిర్వహించారు.

మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నందున సీజ్ చేసినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించారు.

ఇదీ చదవండి:అచ్చంపేటలో భూకబ్జా ఆరోపణలపై స్పందించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details