'షీ బృందాలు' ఎల్లప్పుడూ మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉంటాయని పటాన్చెరు సీఐ నరేష్ అన్నారు. విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల పని పట్టేందుకు 'షీ టీమ్' వారు సాధారణ దుస్తుల్లో ఉంటారని ఆయన తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలకు షీ టీమ్‌పై అవగాహన కల్పించారు.
'100'కు ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో మీ ముందుంటాం..
మహిళలు, విద్యార్థినిలు ఆపదలో ఉన్నప్పుడు 'షీ టీమ్' సేవలు వినియోగించుకోవాలని పటాన్చెరు సీఐ నరేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలకు షీ బృందాలపై అవగాహన కల్పించారు
షీ టీమ్ పై అవగాహన
100 నంబర్ ద్వారా అందిస్తున్న సేవల గురించి విద్యార్థినులకు సీఐ వివరించారు. దీన్ని ఎప్పుడూ, ఎలా వినియోగించుకోవాలనే అంశంపై వారికి సూచనలు ఇచ్చారు. 100 నంబర్‌కు ఫోన్ చేసిన 15 నిమిషాల్లో బ్లూ కోట్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారన్నారు. మీ చుట్టు పక్కల అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు ఇతర ఏమైనా ఘటనలు జరిగినా వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి:పాతబస్తీలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం
Last Updated : Dec 20, 2019, 7:27 PM IST