సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. ఉచిత బస్పాస్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించడం లేదని దుయ్యబట్టారు. సంక్షేమ గృహాల్లో వసతులు సరిగ్గా లేక, వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం చూపకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.
విద్యార్థులతో ఏకమై పోరాడుతాం: ఎస్ఎఫ్ఐ
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు.
విద్యార్థులతో ఏకమై పోరాడుతాం :ఎస్ఎఫ్ఐ