తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసులు పెరుగుతున్నాయి... దుకాణాలు తక్కువ తెరుద్దాం' - నారాయణ ఖేడ్​లో వైరస్ ఉద్ధృతి

నారాయణఖేడ్​లో కరోనా కేసులు పెరుగుతుండడంతో దుకాణాలు తెరిచే సమయాన్ని తగ్గించాలని వర్తక సంఘాలు నిర్ణయించారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం 4 గంటల వరకే దుకాణాలు తెరుస్తామని తెలిపారు. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

self-lock-down-for-shops-in-narayanakhed-at-sangareddy-district
'కేసులు పెరుగుతున్నాయి... దుకాణాలు తక్కువ తెరుద్దాం'

By

Published : Jul 3, 2020, 10:36 AM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పురపలిక సంఘం ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని వర్తక సంఘం ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో కేసులు పెరుగుతున్నందున దుకాణాలు తెరిచే సమయం తగ్గించాలని తీర్మానం చేశారు.

నియోజకవర్గంలో ఇప్పటివరకు 3 కరోనా కేసులు నమోదు కావడం వల్ల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వర్తక సంఘాలు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంగ్టిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయని వర్తక సంఘాలు తెలిపాయి.

ఇవీ చూడండి:సంక్షోభంలో విద్యారంగం.. ప్రక్షాళన చేయాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details