సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి శివారు బాహ్య వలయ రహదారి కూడలిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్‌కు 10 వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - సంగారెడ్డిలో రేషన్ బియ్యం పట్టివేత
అక్రమ వ్యాపారాలను అదుపు చేసేందుకు ఇటీవల పోలీసులు, అధికారులు పీడీ యాక్టు వంటి కఠినమైన కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కొందరి తీరు మారడం లేదు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యాన్ని పటాన్చెరు పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా రవాణా చేస్తున్నందుకు పది మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి :గొంతులో పల్లీ ఇరుక్కుని పదకొండు నెలల చిన్నారి మృతి