అమీన్‌పూర్ వద్ద వాగులో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు - young man lost in water stream in sangareddy district
16:04 October 15
అమీన్‌పూర్ వద్ద వాగులో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ వద్ద వాగులో గల్లంతైన ఆనంద్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇసుకబావి వద్ద గల వాగులో ఆనంద్ కొట్టుకుపోయాడు. బుధవారం చీకటి పడటం వల్ల నిలిచిన గాలింపు చర్యలను మళ్లీ ప్రారంభించారు. మంగళవారం వాగు దాటుతుండగా కారుతో సహా ఆనంద్ వాగులో కొట్టుకుపోయాడు.
అతని కోసం బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. 36 గంటలుగా గాలింపు కొనసాగుతున్నా.. ఇంకా ఆనంద్ ఆచూకీ దొరకలేదు. అతని కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఇవీ చూడండి: ఇసుకబావి వద్ద కొట్టుకుపోయిన కారు... వ్యక్తి గల్లంతు