సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఇందులో జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నమూనాలను తయారు చేసి ప్రదర్శనకు పంపవచ్చు. అయితే వీరి ఇచ్చే ప్రదర్శనలు విజ్ఞాన శాస్త్ర సాంకేతికత ద్వారా సుస్థిర అభివృద్ధి ప్రధానాంశంగా ఉండబోతున్నాయి.
పనిలో నిమగ్నమైన విద్యార్థులు
ఇందులో సుస్థిర వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్యం, శుభ్రత, వనరుల నిర్వహణ, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్ రవాణా సమాచార రంగం, విద్య, ఆటలు, గణిత మోడలింగ్ వంటి అంశాలలో ఏదైనా నా ఒక అంశాన్ని ఎంచుకుని నమూనాలు తయారు చేయాలని జిల్లా సైన్స్ అధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు నమూనాలు తయారు చేసే పనిలో పడ్డారు. కేవలం విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులూ... బోధన ఉపకరణాలను కూడా ప్రదర్శించే అవకాశం కల్పించారు.