ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా, ఆర్థికంగా అందరితో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడ్డెట్లో ప్రత్యేక నిధులు కేటాయించిందని సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు. సంక్షేమ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధుల మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు, పనుల పురోగతిపై సమీక్షించారు. మార్చి నాటికి లక్ష్యాలు చేరుకునేలా పనులు వేగవంతం చేయాలన్నారు. అంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సమావేశంలో పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అందుకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యేలు అధికారులకు స్పష్టం చేశారు.
'ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలి...' - SC, ST FUNDS REVIEW MEETING AT SANGAREDDY COLLECTORATE
సంగారెడ్డి కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధుల మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ హన్మంతరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు.
!['ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలి...'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5151345-thumbnail-3x2-ppp.jpg)
SC, ST FUNDS REVIEW MEETING AT SANGAREDDY COLLECTORATE
'ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలి...'