తెలంగాణ

telangana

ETV Bharat / state

'జన అదాలత్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతం' - సంగారెడ్డి జిల్లా లేటెస్ట్ న్యూస్

సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తోన్న జన అదాలత్ కార్యక్రమంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

sc-st-commission-chairman-errolla-srinivas-told-about-jan-adalat
'జన అదాలత్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతం'

By

Published : Dec 18, 2020, 7:54 PM IST

ఎస్సీ, ఎస్టీ సమస్యలు తెలుసుకుని వాటిని కమిషన్ దృష్టికి తీసుకు రావాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కోరారు. సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న జన అదాలత్ కార్యక్రమంపై కలెక్టరేట్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే కార్యక్రమం అని పేర్కొన్నారు. ప్రజా సంఘాలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

సమస్యలను 2, 3 విచారణల్లోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి నెల 30న సివిల్ హక్కుల రోజును విధిగా నిర్వహించాలని సూచించారు. మూడు నెలలకు ఒకసారి జిల్లా విజిలెన్స్ కార్యక్రమం విధిగా జరపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలకు అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలని చెప్పారు. అధికారులంతా తమ వంతు కృషి చేయాలని కోరారు.

ఇదీ చదవండి:పని చేస్తున్న కంపెనీకే కన్నం వేసిన ఘనులు

ABOUT THE AUTHOR

...view details