చట్టాన్ని అతిక్రమిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం కెరూర్ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణలో భాగంగా బాధితుల వద్దకు వెళ్లి ఆయన వివరాలను సేకరించి నమోదు చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన దుర్గ ప్రసాద్ ఈ నెల 7న గ్రామంలో అంతర్గత రహదారులకు ట్రాక్టర్లలో మట్టిని తీసుకువచ్చి గుంతలను పూడ్చుతున్నారు.
చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు: డీఎస్పీ - సంగారెడ్డి జిల్లా వార్తలు
చట్టాన్ని అతిక్రమించిన వారెవరైనా చర్యలు తప్పవని సంగారెడ్డి డీఎస్పీ అన్నారు. జిల్లాలోని కెరూరు గ్రామంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణలో భాగంగా బాధితుల వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అడ్డగించి దుర్భాషలాడటమే కాకుండా దాడికి పాల్పడినట్లు బాధితుడు దుర్గాప్రసాద్ ఈ నెల 8న వట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు విచారణలో భాగంగా కెరూర్ గ్రామాన్ని సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను బాధితుడి నుంచి సేకరించామని డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీతో పాటు జోగిపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై దశరథ ఉన్నారు.
ఇవీ చూడండి: 'ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది?'