స్తోత్రాలు, సంకీర్తనలతో సంగారెడ్డి పట్టణం మార్మోగింది. పట్టణ శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం చేపట్టిన సప్త సరస్వతీ సమ్మార్చనా మహోత్సవంలో భాగంగా స్తోత్రలహరి నిర్వహించారు. 108 మంది గాయకులు.. 108 సంగీత రాగాల్లో సరస్వతీ మాతను పూజించారు. దేశ నలుమూలల నుంచి వివిధ పీఠాధిపతులు ఈ మహా క్రతువులో భాగస్వాములయ్యారు.
స్తోత్రార్చనలో అమ్మవారిని కొలిచేందుకు అష్టాదశ పురాణాలు, రామాయణ భాగవతం వంటి 320 విశిష్టమైన గ్రంథాల నుంచి 108 ఉత్కృష్ట స్తోత్రాలను సేకరించారు. ఒక్కో స్తోత్ర పఠనం ద్వారా ఒక్కోరకమైన ఫలితం రావడం మరో ప్రత్యేకత. ఈ స్తోత్రాలను 108 మంది గాయకులు.. 108 సంగీత రాగాల్లో ఆలపించారు. కూడలి శృంగేరీ పీఠాధిపతి అభినవ విద్యారణ్య భారతి, మధానానంద సరస్వతి స్వామి వంటి పలువురు పీఠాధిపతులు ఈ క్రతువులో పాల్గొన్నారు.