ఐదో విడత హరిత హారంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో రెండున్నర కోట్లకు పైగా మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల అధ్వర్యంలో సంగారెడ్డి మండలం కులబ్ గురు, ఫసల్ వాది, నాగాపూర్‌లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఓ నర్సరీ ఏర్పాటు చేశారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా 20వేల నుంచి లక్ష మొక్కలు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటికి అనుగుణంగా ఆయా నర్సరీలకు విత్తనాలు సైతం సరఫరా చేశారు. ప్రస్తుతం మొక్కల లభ్యతపై ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నర్సరీల్లో కేవలం కొన్ని రకాలు మాత్రమే ఏపుగా కనిపించాయి. సీతాఫలం, ఎర్రచందనం సరిగ్గా మొలకెత్త లేదు. ఫసల్ వాది నర్సరీలో 8వేల కానుగ మొక్కలు అందుబాటులో ఉన్నాయని రికార్డుల్లో పేర్కొనగా.. క్షేత్ర స్థాయిలో 3వేలకు మించి లేవు. సదాశివపేట మండలం పెద్దాపూర్‌లో 30వేల మొక్కలు పెంచుతున్నట్లు అధికారికంగా రికార్డుల్లో పేర్కొన్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ ప్రస్తుతం నర్సరీనే లేదు. ఎన్కపల్లి నర్సరీలో 20వేల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా... వాస్తవంగా ఇక్కడ 2వేల మొక్కలు కూడా అందుబాటులో లేవు.
నాగాపూర్‌లో లక్ష మొక్కల పెంపకం లక్ష్యం కాగా.. కనీసం పది వేల మొక్కలు కూడా అందుబాటులో లేని పరిస్థితి. సదాశివపేట మండలం
బైట్: సూర్యప్రభ, నర్సరీ నిర్వాహకురాలు