ఆర్టీసీ ఉద్యోగుల విరమణ వయస్సు 58 నుంచి 60కి పెంపు నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంగారెడ్డి జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో డిపో ఎదుట కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున బాణా సంచాలు పేల్చి.. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతఙ్ఞతలు తెలిపారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తమకు అన్ని విధాల లభిస్తుందన్నారు.
'కేసీఆర్ సారూ... మీకు రుణపడి ఉంటాం' - సంగారెడ్డి జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని స్వాగతిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
'కేసీఆర్ సారూ... మీకు రుణపడి ఉంటాం'