సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కొత్త బస్టాండు వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూటీఎస్ మద్దతు తెలిపింది. అనంతరం కార్మికులు బస్టాండ్ ఆవరణలో బతుకమ్మ ఆడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. కొంత మంది మహిళా వృద్ధులు స్వచ్ఛందంగా బతుకమ్మ ఆడి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. కార్మికులపై ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుందని.. దీని వల్ల ఆర్టీసీ నష్టాలపాలు అవుతుందని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే.. విచ్చలవిడిగా ధరలు పెరిగే అవకాశం ఉందని... అందుకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని స్పష్టం చేశారు.
ఉద్యోగ భద్రత కోసమే ఆర్టీసీ కార్మికుల సమ్మె
తాము చేస్తున్న సమ్మె జీతాల కోసం కాదని.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఉద్యోగ భద్రత కోసమేనని సంగారెడ్డి జిల్లా ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు.
ఉద్యోగ భద్రత కోసమే ఆర్టీసీ కార్మికుల సమ్మె