లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంతో పాటు తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను ఎస్పీ సందర్శించారు. ఆంక్షలు అతిక్రమించి అవసరం లేకుండా బయట తిరిగే వ్యక్తుల వాహనాలపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 2 వేలకుపైగా కేసులు నమోదు చేశామని గుర్తు చేశారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే.. - more strictly executes lockdown in sangareddy district
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ హెచ్చరించారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయట తిరిగితే కేసులు పెడతామని అన్నారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే..
లాక్డౌన్ అమలు తర్వాత జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోందని, ఇదే విధంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కేటాయించిన సమయంలో అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో బయట తిరిగితే విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.