"మీ రక్షణ కోసమే... కట్టడి ముట్టడి" - cordon search is to protect law and order
ఎల్లప్పుడూ శాంతిభద్రతలను కాపాడుతూ... ప్రజలకు రక్షణగా ఉన్నామని భరోసా కల్పించేందుకు సంగారెడ్డి పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు.
"మీ రక్షణ కోసమే... కట్టడి ముట్టడి"
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఆల్విన్ కాలనీలో కట్టడి ముట్టడి నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ సూచించారు. ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటి యజమానులకు తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, ఆటో, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
- ఇదీ చూడండి : సాగరతీరంలో సెయిలింగ్ సందడి