సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఐనాక్స్ ఆక్సిజన్ తయారీ పరిశ్రమను సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఆక్సిజన్ తయారీ కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతమేరకు ఎవరెవరికి అందిస్తున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆక్సిజన్ తయారీ పరిశ్రమను పరిశీలించిన ఎస్పీ - సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఐనాక్స్ ఆక్సిజన్ పరిశ్రమను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి పరిశీలించారు. పరిశ్రమకు భద్రత కల్పించాలని సూచించారు.
![ఆక్సిజన్ తయారీ పరిశ్రమను పరిశీలించిన ఎస్పీ ఆక్సిజన్ తయారీ పరిశ్రమను పరిశీలించిన ఎస్పీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:03:10:1621006390-uploadform3files1tg-hyd-56-14-oxizen-plant-sp-visit-av-ts10056-14052021204500-1405f-1621005300-896.jpg)
ఆక్సిజన్ తయారీ పరిశ్రమను పరిశీలించిన ఎస్పీ
ఆక్సిజన్ అవసరమైన చోట అందించాలని సూచించారు. బయట నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రత కల్పించాలని భానూరు పోలీసులను ఆదేశించారు. దీంతో భానూరు పోలీసులు పరిశ్రమ వద్ద పోలీస్ సిబ్బందితో పికెటింగ్ ఏర్పాటు చేశారు.