తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యవసర వాహనాలను అడ్డుకోకండి: సంగారెడ్డి ఎస్పీ - సంగారెడ్డి జిల్లాలో లాక్​డౌన్​

నిత్యావసర సరుకులు, ఔషధాల వాహనాలను అడ్డుకోకుండా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అనుమతించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి పోలీసులకు సూచించారు. నారాయణ్​ ఖేడ్​లోని వివిధ కూడళ్లు, సరిహద్దుల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచామని తెలిపారు.

అత్యవసర వాహనాలను అడ్డుకోకండి: సంగారెడ్డి ఎస్పీ
అత్యవసర వాహనాలను అడ్డుకోకండి: సంగారెడ్డి ఎస్పీ

By

Published : Apr 5, 2020, 10:30 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్​ను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి పరిశీలించారు. లాక్ డౌన్​కు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలోని వివిధ కూడళ్లు, సరిహద్దుల్లో చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేసి నిఘా పెంచామన్నారు. నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, ఔషధాల వాహనాలను అడ్డుకోకుండా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అనుమతించాలని ఆదేశించారు. పట్టణం సహా గ్రామాల్లో పరిస్థితులను డీఎస్పీ రాజు, సీఐలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సామాజిక దూరం పాటిస్తూ, ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించేలా చూడాలని చంద్రశేఖర్​ రెడ్డి సూచించారు.

అత్యవసర వాహనాలను అడ్డుకోకండి: సంగారెడ్డి ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details