సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఐలా ఆధ్వర్యంలో నిర్మించిన పోలీస్ ఔట్ పోస్ట్‌ను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో కలిసి ప్రారంభించారు. ఈ అవుట్ పోస్ట్ బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్‌ను అనుసంధానంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.
పాశమైలారం పారిశ్రామికవాడలో పోలీస్ ఔట్ పోస్ట్ - Sangareddy Sp Chandrashekar reddy
పాశమైలారం పారిశ్రామిక వాడలో పోలీస్ ఔట్ పోస్టును సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. శాంతి భద్రతలను కాపాడి పరిశ్రమలు సవ్యంగా నడిచే విధంగా దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
పాశమైలారం పారిశ్రామికవాడలో పోలీస్ ఔట్ పోస్ట్
ఇక్కడ ఎస్సైతో పాటు పది మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. కేవలం ఇది పారిశ్రామిక ప్రాంత శాంతిభద్రతల కోసం వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.