తెలంగాణ

telangana

ETV Bharat / state

'రూ.1,000 కోట్ల భూకుంభకోణాన్ని బయటపెట్టాను.. కేటీఆర్​ సార్​ మీరే నన్ను కాపాడాలి' - తెలంగాణ తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లాలోని అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు కొందరు భూ బకాసురులు యత్నిస్తున్నారని ఆ గ్రామ సర్పంచ్ హైదర్​గూడలో ఫిర్యాదు చేశారు. కొందరు రియల్ ఎస్టేట్ వాళ్లు స్థానిక రెవెన్యూ అధికారులతో చేయి కలిపి భూ దందా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో వారి నుంచి తనకు, తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని.. కాపాడాలంటూ మంత్రి కేటీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

BRS Sarpanch
BRS Sarpanch

By

Published : Jan 8, 2023, 6:01 PM IST

Updated : Jan 8, 2023, 6:34 PM IST

సంగారెడ్డి జిల్లాలో భూ కుంభకోణం బయటపెట్టిన తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని అధికార పార్టీకి చెందిన ఓ సర్పంచ్ మంత్రి కేటీఆర్​కు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 261లోని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు భూ బకాసురులు ప్రయత్నిస్తున్నారని మాకం తిరుమల వాసు(సర్పంచ్).. హైదరాబాద్​లోని హైదర్​గూడలో ఫిర్యాదు చేశారు.

రియల్టర్లు, పెట్టుబడిదారులతో కుమ్మక్కైన రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో స్థానిక రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారని వెల్లడించారు. మొత్తం రూ.1000 కోట్ల విలువ చేసే 588 ఎకరాల స్థలంలో ప్రభుత్వం, రైతులు, పేదలు, విశ్రాంత ఆర్మీ అధికారుల భూములు, ప్లాట్లు ఉన్నాయన్నారు. అధికార యంత్రాంగంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. రైతుల పక్షాన నిలబడిన తనను కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి పదవి నుంచి సస్పెండ్ చేశారని వాపోయారు.

తమకు సహకరించాలని పెద్దలతో హుకూం జారీ చేశారని.. ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిని అవకాశంగా చేసుకొని వారి అనుచరుల పేర్లను నమోదు చేసుకుని పేద రైతుల పేర్లు లేకుండా కుట్రలు పన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​లు స్పందించి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. రియల్టర్లు, అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వేడుకున్నారు.

'రూ.1,000 కోట్ల భూకుంభకోణాన్ని బయటపెట్టాను.. కేటీఆర్​ సార్​ మీరే నన్ను కాపాడాలి'

ఇవీ చదవండి:

Last Updated : Jan 8, 2023, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details