సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్డౌన్ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మినహాయింపు ఇవ్వడంతో ప్రజలు సడలింపు సమయంలోనే తమ పనులను చూసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత రోడ్డు పైకి వాహనాలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకి రావొద్దని.. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బాలాజీ హెచ్చరించారు.
Lockdown implementation: సంగారెడ్డిలో పటిష్టంగా అమలవుతున్న లాక్డౌన్ - సంగారెడ్డిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న డీఎస్పీ బాలాజీ
సంగారెడ్డిలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలీసులు ప్రజలెవరినీ రోడ్లపైకి రానివ్వడం లేదు. అనవసరంగా వచ్చిన వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
సంగారెడ్డిలో పటిష్టంగా అమలవుతున్న లాక్డౌన్
పట్టణంలోని కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద డీఎస్పీ బాలాజీ తనిఖీలు నిర్వహించారు. అత్యవసరమైన పని ఉంటేనే బయటకి రావాలని డీఎస్పీ అన్నారు. సడలింపు సమయంలో కచ్చితంగా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని.. సూచించారు. ఒక వేళ బయటకి వస్తే తగిన గుర్తింపు కార్డులు వెంట తెచ్చుకోవాలని డీఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి :ఆనందయ్య మందు.. కోటయ్య మృతి