తెలంగాణ

telangana

ETV Bharat / state

'పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను తొలగించాలి' - సంగారెడ్డిలో వాహనాలు సీజ్​ చేసిన పోలీసులు

కొందరికి ఇచ్చిన పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను (పోలీసు, ప్రెస్​) వాహనాలపై నుంచి తొలగించాలని పోలీసులు పేర్కొన్నారు. సంగారెడ్డిలో చెక్​పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్​ చేశారు.

'పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను తొలగించాలి'
'పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను తొలగించాలి'

By

Published : Apr 20, 2020, 11:27 AM IST

సంగారెడ్డిలో లాక్ డౌన్ పకడ్బందీగా జరుగుతుంది. పట్టణంలో వివిధ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు.. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేశారు. అనంతరం పోలీసు స్టేషన్​కి తరలించారు.

కొందరి వాహనాలకు ఇచ్చిన పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను (పోలీసు, ప్రెస్) వాహనాలపై నుంచి తొలగించాలని తెలిపారు. ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండి అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని హెచ్చరించారు.

ఇదీ చూడండి :గృహ హింస ఫిర్యాదులకు సంప్రదించండి

ABOUT THE AUTHOR

...view details