సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్డౌన్(Lock down) పటిష్టంగా కొనసాగుతోంది. అత్యవసరం అయితేనే జనాలు బయటకు రావాలని పోలీసులు ఆదేశించారు. అనవసరంగా బయటకి వస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.
Lock down: 'ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దు' - సంగారెడ్డి పోలీసులు
సంగారెడ్డి నియోజకవర్గంలో పోలీసులు లాక్డౌన్(Lock down)ను కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు ఆ సందర్భంగా సూచించారు.
Lock down: 'ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దు'
చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గుర్తింపు కార్డులు ఉంటేనే బయటకి అనుమతిస్తున్నారు. మినహాయింపు సమయంలో కూడా కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటించాలని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:DIGITAL SURVEY: జూన్ 11 నుంచి పైలట్ విధానంలో డిజిటల్ భూసర్వే