సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో కౌన్సిలర్లు తమ వార్డులకు సంబంధించిన సమస్యలను అధికారులకు విన్నవించారు. ఇంతకుముందు సమావేశంలో చర్చించిన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు.
గత సమావేశంలో విన్నవించిన సమస్యలకు పరిష్కారాలేవి? - sangareddy municipal meeting
సంగారెడ్డిలోని కొన్ని వార్డుల్లో భూములు కబ్జాలకు గురవుతున్నాయని మున్సిపల్ అధికారులకు కౌన్సిలర్లు తెలిపారు. వాటిపై దృష్టి సారించి భూములను కాపాడాలని కోరారు.
చెత్త నిర్వహణ, నీటి పైపుల లీకేజీ, నీటి సమస్యల గురించి పలుమార్లు విన్నవించినా.. అధికారులు పరిష్కరించలేదని అన్నారు. కొన్ని వార్డుల్లో భూ కబ్జాలు జరుగుతున్నాయని, వాటిపై దృష్టి సారించాలని సూచించారు. వివిధ వార్డుల్లోని కౌన్సిలర్లు చెప్పిన సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరించాలని అధికారులకు అదనపు కలెక్టర్, మున్సిపల్ ఇంఛార్జి కమిషనర్ రాజర్షి ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ విజయలక్ష్మి రవి, వైస్ ఛైర్పర్సన్ లత విజయేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : మే17 నుంచి పదో తరగతి పరీక్షలు: విద్యాశాఖ