సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నూతనంగా నిర్మించతలపెట్టిన యుజీడీ, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని జలమండలిని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారు. అలాగే అమీన్‌పూర్ మండలం పటేల్బూడ గ్రామంలో ఓవర్ హైడ్ ట్యాంకు నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించాలని ఆయన జలమండలి ఎండీ దానకిశోర్ను కోరారు.
ట్యాంకుల నిర్మాణానికి నిధుల కోసం వినతి - జలమండలి ఎండీ దానకిశోర్
యుజీడీ, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి నిధులు కేటాయింలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హైదరాబాద్లో జలమండలి ఎండీ దానకిషోర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. 64 లక్షల రూపాయలతో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
ట్యాంకుల నిర్మాణానికి నిధుల కోసం వినతి
తమ విజ్ఞప్తిపై ఎండీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని ప్రకటించారు.