తెలంగాణ

telangana

ETV Bharat / state

Jaggareddy Comments: 'సంగారెడ్డిలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తా..' - సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Jaggareddy Comments: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారాలంటే తనకు అడ్డు ఎవరూ లేదన్నారు. మార్చి 21న సంగారెడ్డిలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తానని ప్రకటించారు.

Sangareddy MLA Jaggareddy announced public meeting date in sangareddy
Sangareddy MLA Jaggareddy announced public meeting date in sangareddy

By

Published : Feb 26, 2022, 5:12 AM IST

Jaggareddy Comments: సొంతపార్టీ వాళ్లే తనపై తప్పుడు ప్రచారాలు చేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు. సంగారెడ్డిలో ఆయన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పార్టీ మారాలంటే తనకు అడ్డు ఎవరూ లేరన్న జగ్గారెడ్డి.. తెరాస, భాజపాలో చేరే అవకాశం లేదని మరోసారి స్పష్టం చేశారు. త్వరలో సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వతే.. తన రాజకీయ భవిష్యత్​పై నిర్ణయం తీసుకుంటానని కార్యకర్తలకు వివరించారు. సభ్యత్వ నమోదులో సంగారెడ్డి నియోజకవర్గం వెనకబడిందని.. కార్యకర్తలు దీనిపై దృష్టి సారించి మార్చి పదో తేదిలోపు 75వేల సభ్యత్వం చేయాలని సూచించారు. మార్చి 21న సంగారెడ్డిలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తానని ప్రకటించారు.

"పార్టీ మారాలంటే నాకు అడ్డు ఎవరూ లేరు. తెరాస, భాజపాలో చేరే అవకాశమే లేదు. త్వరలోనే సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వతే.. రాజకీయ భవిష్యత్​పై నిర్ణయం తీసుకుంటా. సభ్యత్వ నమోదులో సంగారెడ్డి నియోజకవర్గం వెనకబడింది. దీనిపై దృష్టి సారించి మార్చి పదో తేదిలోపు 75వేల సభ్యత్వం చేయాలి. మార్చి 21న సంగారెడ్డిలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తా." - జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details