ఆర్టీసీ కార్మికుల పట్ల తప్పుడు నిర్ణయాల తీసుకుంటే... కేసీఆర్కు భవిష్యత్తులో చెడ్డ పేరు తప్పదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ పునరాలోచించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ప్రైవేటు పరం అయితే ప్రజలు నానా అవస్థలు పడతారని తెలిపారు. పెండింగ్లో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
'తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్కు చెడ్డపేరు వస్తది'
ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నచూపు చూడకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. సుఖసంతోషాలతో ఉంటామని ఆశపడ్డ ఆర్టీసీ కార్మికులు... తెలంగాణ పరిపాలనే వారికి శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
jaggareddy
కేంద్రం ప్రభుత్వం ప్రైవేటీకరణ చట్టం తేవడంతోనే.. రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చినట్టైందని ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ మానవత్వంతో కార్మికులను విధుల్లోకి తీసుకుని... వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
ఇదీ చూడండి: 'సమ్మె ఉద్ధృతం... రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు'