తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు హర్షనీయం: జగ్గారెడ్డి - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించడం మంచి విషయమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎల్​ఆర్​ఎస్​ రద్దు చేయాలని ఆయన కోరారు. రూ.10వేలతో ఇళ్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.

sangareddy-mla-jagga-reddy-told-about-old-method-registrations
పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు హర్షనీయం: జగ్గారెడ్డి

By

Published : Dec 27, 2020, 5:36 PM IST

Updated : Dec 27, 2020, 6:40 PM IST

పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు హర్షనీయం: జగ్గారెడ్డి

ఈ పరిస్థితుల్లో ఇళ్లను, ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి రూ.పదివేలు మాత్రమే తీసుకోవాలని కోరారు. సీఎం నుంచి ఈ ప్రకటన త్వరగా వస్తే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అపోలో నుంచి సూపర్​స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్

Last Updated : Dec 27, 2020, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details