మెదక్ జిల్లాలో తాను తప్ప అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలేనని.. అందుకే వారెవరూ నీళ్ళ గురించి మాట్లాడట్లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. స్థానిక ఎంపీ ఒక్కరోజూ నీళ్ల కోసం నోరు తెరవలేదన్నారు. మంజీరా డ్యాంను నీటితో నింపేవరు తమ పార్టీ పోరాటం ఆగదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
'వాళ్లది పోలీసు బలమైతే నాది ప్రజా బలం' - జగ్గారెడ్డి ప్రెస్‌మీట్
తెరాసకు పోలీసు బలం ఉంటే తనకు కార్యకర్తల బలం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. మంజీరా డ్యాం నీటితో నింపేవరకు తమ పార్టీ పోరాటం ఆగదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
వాళ్లుకు పోలీసుల బలం ఉంటే... నాకు కార్యకర్తల బలం ఉంది
త్వరలో మంత్రి హరీశ్ రావుతో జరిగే మీటింగ్‌లో పాల్గొని, నీళ్ల విషయంపై నిలదీస్తానని తెలిపారు. ఆ సమయంలో తనపై తెరాస నాయకులు దాడులు చేసే అవకాశం ఉంది. అన్నింటికీ సిద్ధపడే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తానని చెప్పారు. తెరాసకు పోలీసు బలం ఉంటే తనకు కార్యకర్తల బలం ఉందని పేర్కొన్నారు. తాను ప్రజల్లో తిరుగుతానని.. నిలదీస్తే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
TAGGED:
జగ్గారెడ్డి ప్రెస్‌మీట్