వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం నూతనంగా తీసుకువచ్చిన 2019 చట్టం ఎంతో విశిష్టమైనదని సంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిలారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వస్తువుల నాణ్యతా లోపాలు ఉంటే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి.. పరిహారం పొందాలని సూచించారు. 1986 వినియోగదారుల చట్టం కన్నా.. నూతనంగా తీసుకువచ్చిన 2019 చట్టం వినియోగదారులకు ఎంతో మేలుచేస్తుందని తెలిపారు. వినియోగదారుల హక్కులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
'వినియోగదారుల చట్టంపై ప్రజలకు అవగాహన అవసరం' - sangareddy jc suggestions to consumers
వినియోగదారుల చట్టంపై ప్రజలకు అవగాహన అవసరమని సంగారెడ్డి సంయుక్త కలెక్టర్ నిఖిలారెడ్డి అన్నారు. 1986 చట్టం కంటే ఇటీవల తీసుకొచ్చిన నూతన చట్టం వినియోగదారులకు ఎంతో మేలుచేస్తుందని తెలిపారు.
!['వినియోగదారుల చట్టంపై ప్రజలకు అవగాహన అవసరం' sangareddy jc speaks on consumers day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5479594-558-5479594-1577188595747.jpg)
'వినియోగదారుల చట్టంపై ప్రజలకు అవగాహన అవసరం'
'వినియోగదారుల చట్టంపై ప్రజలకు అవగాహన అవసరం'