అడవులను కాపాడుకుంటేనే మానవ మనుగడ కొనసాగుతుందని సంగారెడ్డి జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సిబ్బందితో కలిసి ఆయన సేకరించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే జరిమాన తప్పదు: అటవీ అధికారులు - తెలంగాణ అటవీ వార్తలు
ప్లాస్టిక్ వ్యర్ధాల కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని సంగారెడ్డి అటవీ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాలోని నల్లవల్లి అటవీ ప్రాంతంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సిబ్బందితో కలిసి ఆయన సేకరించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే జరిమాన తప్పదు: అటవీ అధికారులు
రహదారుల వెంబడి కోతులకు ఎవరూ ఆహారం వేయవద్దని అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. అలా చేయడం వల్ల ఒంటరిగా వెళ్తున్న ద్విచక్రవాహనదారులపై దాడికి దిగిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. కోతులకు కావలసిన ఆహారం అడవిలో పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. ప్లాస్టిక్, చికెన్ వ్యర్ధాలను అటవీ ప్రాంతంలో వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఆకలి బాధలు గ్రహించి.. యానిమల్ ట్రస్ట్ స్థాపించి