తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతల ఆందోళన - సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలో అధికారులు ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే తడిసిపోతోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించకుండా ఆలస్యం చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

sangareddy farmers facing problems
అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతల ఆందోళన

By

Published : May 9, 2020, 3:26 PM IST

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలోని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షాలు, మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేవలం తూకం వేయడమే కాకుండా ధాన్యం మిల్లులకు తరలించడానికి కూడా అధికారులు ఆలస్యం చేస్తున్నారు.

లారీలు రావడం లేదంటూ... సాకులు చెబుతూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. ధాన్యం తడవకుండా గోదాముల్లో నిల్వ చేయాలని రైతులు అధికారులను వేడుకున్న వారు పట్టించుకోవట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఈ విషయంsలో నారాయణ్​ఖేడ్ సహాయ వ్యవసాయ సంచాలకులు కరుణాకర్ రెడ్డిని వివరణ కోరగా... లారీల కొరత ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. రైతుల ధాన్యాన్ని తడవకుండా చూసేలా స్థానిక అధికారులకు అదేశిస్తామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details