భూమిక సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్‌సాన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. సిద్దేష్ చౌహన్ అనే ఉపాధ్యాయుడి మార్గదర్శనంలో రాష్ట్రస్థాయి సైన్సు పోటీల కోసం పింక్‌లూ నమూనాని రూపొందించింది. ఈ నమూనాతో అందరి మన్ననలు అందుకుంటోంది.
మహిళల కోసమే..
పాఠశాలలు, కళాశాలలకు వచ్చే అమ్మాయిలు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో టాయిలెట్‌కు వెళ్లడం కోసం పడే ఇబ్బందే ఈ ఆలోచనకు కారణమని ఆ బాలిక చెబుతోంది. అపరిశుభ్రంగా, అసౌకర్యం తలెత్తకుండా ఉండేందుకు ఈ నమూనాని తయారు చేసినట్లు వివరించింది.